Pages

Sunday, January 8, 2012

మరణమా నువ్వో కవితవి


రాజేష్ ఖన్నా ప్రథాన పాత్రధారిగా రూపొందిన ఆనంద్ అనే సినిమాలో డా. భాస్కర్ బెనర్జీ అనే పాత్ర చదివే కవిత ఒకటి ఉంది. మౌత్ తూ ఏక్ కవితా హై అన్న ఈ కవిత చాలా తాత్త్వికంగా ఉంది. ప్రముఖ కవి గుల్జార్ రచించిన ఈ కవితకు నా అనువాదం ఇది. సినిమాలో డాక్టర్ పాత్రలో ధరించిన అమితాభ్  గొంతులో ఈ కవిత జీవత్వాన్ని పొంది, మరింత మార్మికతను సంతరించుకుందనడం అతిశయోక్తి కాదు. అనువాదంలో నేను కాస్త స్వేచ్ఛ తీసుకున్నా.



మరణమా నువ్వో కవితవి

మరణమా నువ్వో కవితవి
నాకో కవిత బాకీ పడ్డావు
నా కవిత నాకిస్తావుగా

మరో అడుగు నడక

అనే సైట్లో అనూప్ భార్గవ అనే కవి రాసిన అగలే ఖంబే తక్ అనే కవిత చదివాను. ముందు దాన్ని యథాతథంగా అనువాదం చేద్దామనుకున్నా. కాదు... దాని ఆధారంగా స్వంతది రాద్దామనుకున్నా. కాస్తంత వియోగాన్ని కలిపా... అప్పుడు ఆ వంటకం ఇలాగ వచ్చింది.

మరో అడుగు నడక
ఆ కొండదారుల్లో
మట్టినిండిన మార్గాల్లో
నువ్వూ నేను వేసిన అడుగులు
నాకింకా గుర్తున్నాయి.
చేతులు పట్టుకుని
మైళ్ల దూరం కొలిచాం
మార్గమధ్యంలో నేను అలిసిపోతే
ఇంకొక్క అడుగే, ఆ స్తంభందాకే
అనే నీ మాటలూ గుర్తున్నాయి.