Pages

Wednesday, January 2, 2013

कोई जब तुम्हारा हृदय तोड़ दे తెలుగు అనువాదం


మనోజ్ కుమార్ నటించిన చిత్రాలలో పూరబ్ ఔర్ పశ్చిమ్ కి ఉన్న ఖ్యాతి అంతా ఇంతా కాదు.  ఆ చిత్రంలోని कोई जब तुम्हारा हृदय तोड़ दे అనే  పాట దేశాన్ని ఉర్రూతలూగించింది. ఇందీవర్ రచించిన ఈ గీతాన్ని కళ్యాణ్ జీ – ఆనంద్ జీ సంగీత నేతృత్వంలో అమర గాయకుడు ముఖేష్ పాడి దీన్ని మరింత అద్బుతమైన గీతంగా మలిచారు. ఆ పాటకి నా స్వేచ్ఛానువాదం ఇది. తెలుగు తెగులు నాకు కూడా ఉంది కనుక అనువాగంవో స్వేచ్ఛ కొంచెం ఎక్కువే తీసుకున్నాను.

రా నా చెలీ


ఎవరో ఆ చిత్రకారుడెవరో


బూంద్ జో బన్ గయీ మోతీ అనే పాత హిందీ సినిమాకుగాను సతీష్ భాటియా సంగీత దర్శకత్వంలో అమరగాయకుడు ముఖేష్ పాడిన ఒక మనోజ్ఞగీతానికి ఇది స్వేచ్ఛానువాదం. భరత్ వ్యాస్ అనే కవి కలం అక్షరాలను అద్దితే దానికి ముఖేష్ గొంతు దానికి వివిధ వర్ణాలను అద్దింది. ఎంతో ప్రసిద్ధమైన  ये कौन चित्रकार है అనే పాటకు ఇది స్వేచ్ఛానువాదం. స్వేచ్ఛానువాదం అనడానికి కారణం మూలసోయగాన్ని యథాతథంగా ఆవిష్కరించడం చేతగాని నా చేతగానితనమే అని వినయంగా ఒప్పుకుంటూ - 

ఎవరో ఆ చిత్రకారుడెవరో


Sunday, January 8, 2012

మరణమా నువ్వో కవితవి


రాజేష్ ఖన్నా ప్రథాన పాత్రధారిగా రూపొందిన ఆనంద్ అనే సినిమాలో డా. భాస్కర్ బెనర్జీ అనే పాత్ర చదివే కవిత ఒకటి ఉంది. మౌత్ తూ ఏక్ కవితా హై అన్న ఈ కవిత చాలా తాత్త్వికంగా ఉంది. ప్రముఖ కవి గుల్జార్ రచించిన ఈ కవితకు నా అనువాదం ఇది. సినిమాలో డాక్టర్ పాత్రలో ధరించిన అమితాభ్  గొంతులో ఈ కవిత జీవత్వాన్ని పొంది, మరింత మార్మికతను సంతరించుకుందనడం అతిశయోక్తి కాదు. అనువాదంలో నేను కాస్త స్వేచ్ఛ తీసుకున్నా.



మరణమా నువ్వో కవితవి

మరణమా నువ్వో కవితవి
నాకో కవిత బాకీ పడ్డావు
నా కవిత నాకిస్తావుగా

మరో అడుగు నడక

అనే సైట్లో అనూప్ భార్గవ అనే కవి రాసిన అగలే ఖంబే తక్ అనే కవిత చదివాను. ముందు దాన్ని యథాతథంగా అనువాదం చేద్దామనుకున్నా. కాదు... దాని ఆధారంగా స్వంతది రాద్దామనుకున్నా. కాస్తంత వియోగాన్ని కలిపా... అప్పుడు ఆ వంటకం ఇలాగ వచ్చింది.

మరో అడుగు నడక
ఆ కొండదారుల్లో
మట్టినిండిన మార్గాల్లో
నువ్వూ నేను వేసిన అడుగులు
నాకింకా గుర్తున్నాయి.
చేతులు పట్టుకుని
మైళ్ల దూరం కొలిచాం
మార్గమధ్యంలో నేను అలిసిపోతే
ఇంకొక్క అడుగే, ఆ స్తంభందాకే
అనే నీ మాటలూ గుర్తున్నాయి.

Wednesday, November 23, 2011

నేటి భావితరం - నాదే ఓ పాత కవిత

నేటి భావితరం
ఇది దాదాపు ఏదేళ్లక్రితం మాతృభాషకు దూరమౌతున్న బాలతరం గురించ ఈటీవి-2కి ఓ కార్యక్రమానికి స్క్రిప్టు రాస్తూ తయారుచేసుకున్న ఓ చిరు కవిత.              ........పూర్ణప్రజ్ఞాభారతి

వారు
చిన్నారులు
సృజనశీలురు
ప్రతిభావంతులు
అయితే మాత్రమేం
మూడు భాషల నిబంధనక్రింద
గొంతు కోల్పోయిన
నిర్భాగ్యులు
శబ్దదరిద్రులు

Friday, October 28, 2011

నా పాత్రలు - అనువాద కవిత


1937లో జన్మించిన చంద్రశేఖర కంబార కన్నడ సాహిత్యసీమలో ఒక విశిష్టస్థానం ఆక్రమించిన సాహితీమేరువు. జ్ఞానపీఠ పురస్కారాన్ని, సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీ సత్కారం పొందిన కంబార కవి, నాటకకర్త, జానపద విజ్ఞానవేత్త, చిత్ర దర్శకుడే కాక హంపీలో స్థాపించిన కన్నడ విశ్వవిద్యాలయపు తొలి ఉపకులపతి కూడా. ఉత్తర కన్నడ మాండలిక ప్రయోగానికి పెట్టింది పేరైన కంబార రచించిన ఒక కవితకు నేను చేసిన అనువాదం ఇక్కడ ఇస్తున్నాను.

Monday, September 26, 2011

Translated Poetry అనువాద కవిత - త్రీ ఈడియట్స్


రచనాకార్ బ్లాగులో ఈ హిందీ కవిత కనబడింది. దాన్ని నేను తెలుగులోకి అనువదించాను. చదివి మీ అభిప్రాయాలను తెలపండి
త్రీ  ఈడియట్స్
మూల కవిత (హిందీ)                                       అనువాదం
గోపీ గోస్వామి                              డా.. కే. పూర్ణప్రజ్ఞాభారతి

Tuesday, September 20, 2011

ఊర్వశీసార్వభౌమ ఈహామృగం - పరిచయం

సంస్కృత నాటక సాహిత్యంలో దశవిధమైన ప్రముఖ భేదాలు కనిపిస్తాయి. అయితే వాటిలో నాటకం, ప్రహసనం అనే రెండు భేదాలకే చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. మిగిలిన వాటికి కాస్త తక్కువగానే ఉదాహరణలు కనిపిస్తాయి. మరికొన్నిటికి బాగా భూతద్దం వేసి చూస్తే తప్ప ఉదాహరణలు కనిపించడం లేదు. అలా ఉదాహరణలు అతి తక్కువగా కనిపించే ఒక నాటకభేదం ఈహామృగం. కర్ణాటకాకు చెందిన వేంకామాత్యుడు రచించిన ఊర్వశీ సార్వభౌమేహామృగ పరిచయం ఇలా ఉంది.

మళ్లీ ఈ బ్లాగును నిద్రలేపుతున్నాను.

ఈ బ్లాగును ఆరంభించిన తర్వాత కొన్ని పోస్టులు వేసినా గత సంవత్సర కాలంగా పోస్టులు వెయ్యలేకపోయాను. అందుకు కారణాలు సవాలక్ష. ఈ విరామనంతరం మళ్లీ నా బ్లాగును లేపుతున్నాను. ఇక రెగ్యులర్ గా మళ్లీ పోస్టులే వేస్తాను.

నేను వస్తున్నాను.