Pages

Wednesday, January 2, 2013

कोई जब तुम्हारा हृदय तोड़ दे తెలుగు అనువాదం


మనోజ్ కుమార్ నటించిన చిత్రాలలో పూరబ్ ఔర్ పశ్చిమ్ కి ఉన్న ఖ్యాతి అంతా ఇంతా కాదు.  ఆ చిత్రంలోని कोई जब तुम्हारा हृदय तोड़ दे అనే  పాట దేశాన్ని ఉర్రూతలూగించింది. ఇందీవర్ రచించిన ఈ గీతాన్ని కళ్యాణ్ జీ – ఆనంద్ జీ సంగీత నేతృత్వంలో అమర గాయకుడు ముఖేష్ పాడి దీన్ని మరింత అద్బుతమైన గీతంగా మలిచారు. ఆ పాటకి నా స్వేచ్ఛానువాదం ఇది. తెలుగు తెగులు నాకు కూడా ఉంది కనుక అనువాగంవో స్వేచ్ఛ కొంచెం ఎక్కువే తీసుకున్నాను.

రా నా చెలీ


ఎవరో ఆ చిత్రకారుడెవరో


బూంద్ జో బన్ గయీ మోతీ అనే పాత హిందీ సినిమాకుగాను సతీష్ భాటియా సంగీత దర్శకత్వంలో అమరగాయకుడు ముఖేష్ పాడిన ఒక మనోజ్ఞగీతానికి ఇది స్వేచ్ఛానువాదం. భరత్ వ్యాస్ అనే కవి కలం అక్షరాలను అద్దితే దానికి ముఖేష్ గొంతు దానికి వివిధ వర్ణాలను అద్దింది. ఎంతో ప్రసిద్ధమైన  ये कौन चित्रकार है అనే పాటకు ఇది స్వేచ్ఛానువాదం. స్వేచ్ఛానువాదం అనడానికి కారణం మూలసోయగాన్ని యథాతథంగా ఆవిష్కరించడం చేతగాని నా చేతగానితనమే అని వినయంగా ఒప్పుకుంటూ - 

ఎవరో ఆ చిత్రకారుడెవరో


Sunday, January 8, 2012

మరణమా నువ్వో కవితవి


రాజేష్ ఖన్నా ప్రథాన పాత్రధారిగా రూపొందిన ఆనంద్ అనే సినిమాలో డా. భాస్కర్ బెనర్జీ అనే పాత్ర చదివే కవిత ఒకటి ఉంది. మౌత్ తూ ఏక్ కవితా హై అన్న ఈ కవిత చాలా తాత్త్వికంగా ఉంది. ప్రముఖ కవి గుల్జార్ రచించిన ఈ కవితకు నా అనువాదం ఇది. సినిమాలో డాక్టర్ పాత్రలో ధరించిన అమితాభ్  గొంతులో ఈ కవిత జీవత్వాన్ని పొంది, మరింత మార్మికతను సంతరించుకుందనడం అతిశయోక్తి కాదు. అనువాదంలో నేను కాస్త స్వేచ్ఛ తీసుకున్నా.



మరణమా నువ్వో కవితవి

మరణమా నువ్వో కవితవి
నాకో కవిత బాకీ పడ్డావు
నా కవిత నాకిస్తావుగా

మరో అడుగు నడక

అనే సైట్లో అనూప్ భార్గవ అనే కవి రాసిన అగలే ఖంబే తక్ అనే కవిత చదివాను. ముందు దాన్ని యథాతథంగా అనువాదం చేద్దామనుకున్నా. కాదు... దాని ఆధారంగా స్వంతది రాద్దామనుకున్నా. కాస్తంత వియోగాన్ని కలిపా... అప్పుడు ఆ వంటకం ఇలాగ వచ్చింది.

మరో అడుగు నడక
ఆ కొండదారుల్లో
మట్టినిండిన మార్గాల్లో
నువ్వూ నేను వేసిన అడుగులు
నాకింకా గుర్తున్నాయి.
చేతులు పట్టుకుని
మైళ్ల దూరం కొలిచాం
మార్గమధ్యంలో నేను అలిసిపోతే
ఇంకొక్క అడుగే, ఆ స్తంభందాకే
అనే నీ మాటలూ గుర్తున్నాయి.

Wednesday, November 23, 2011

నేటి భావితరం - నాదే ఓ పాత కవిత

నేటి భావితరం
ఇది దాదాపు ఏదేళ్లక్రితం మాతృభాషకు దూరమౌతున్న బాలతరం గురించ ఈటీవి-2కి ఓ కార్యక్రమానికి స్క్రిప్టు రాస్తూ తయారుచేసుకున్న ఓ చిరు కవిత.              ........పూర్ణప్రజ్ఞాభారతి

వారు
చిన్నారులు
సృజనశీలురు
ప్రతిభావంతులు
అయితే మాత్రమేం
మూడు భాషల నిబంధనక్రింద
గొంతు కోల్పోయిన
నిర్భాగ్యులు
శబ్దదరిద్రులు