Pages

Tuesday, September 20, 2011

ఊర్వశీసార్వభౌమ ఈహామృగం - పరిచయం

సంస్కృత నాటక సాహిత్యంలో దశవిధమైన ప్రముఖ భేదాలు కనిపిస్తాయి. అయితే వాటిలో నాటకం, ప్రహసనం అనే రెండు భేదాలకే చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. మిగిలిన వాటికి కాస్త తక్కువగానే ఉదాహరణలు కనిపిస్తాయి. మరికొన్నిటికి బాగా భూతద్దం వేసి చూస్తే తప్ప ఉదాహరణలు కనిపించడం లేదు. అలా ఉదాహరణలు అతి తక్కువగా కనిపించే ఒక నాటకభేదం ఈహామృగం. కర్ణాటకాకు చెందిన వేంకామాత్యుడు రచించిన ఊర్వశీ సార్వభౌమేహామృగ పరిచయం ఇలా ఉంది.


రూపకాలు - ఊర్వశీ సార్వభౌమ ఈహామృగం

భావాభివ్యక్తి మానవుని సహజ స్వబావం. భాష. లిపి లేనిరోజుల్లో మానవుడు చిత్రాల ద్వారా తన మనస్సులోని బావాలను వ్యక్తపరిచేవాడు. భాష. లిపి ఉదయించిన తరువాత మానవుడు తన మనస్సులోని భావాలను వ్యక్తపరచం మరింత సులభతరమైంది. ఇట్టిక్రమంలోనే సాహిత్యం ఆవిర్భవించింది. ఇలా విస్తరించిన సాహిత్యాన్ని ఇంద్రియ సన్నికర్ష ఆధారంగా ఋషిమునిగణం దృశ్యశ్రావ్యాలనే రెండు విభాగాలుగా విభజించింది. నటుని అంగవిక్షేపాలుభావభంగిమలుఉచ్చారణ సౌష్ఠవాల వల్ల చాక్షుషప్రీతిని కలిగించేవి దృశ్యకావ్యాలుగానుకవి లేఖిని ద్వారా అభివ్యక్తమై శ్రవణేంద్రియాల వల్ల రసాస్వాదనకు వీలు కలిగించేవి శ్రవ్యకావ్యాలుగాను విభజితమైనాయి. నాటకం మొదటి విభాగానికి చెందినవి. కావ్యేషు నాటకం రమ్యం నాటకాంతం హి సాహిత్యం అనే ఉక్తులు నాటకకీర్తిని తెలియజేస్తున్న

భారతీయ రూపకం కూడా వేలాది సంవత్సరాల చరిత్రను కలిగి ఉండిసామాజికుల మనోరంజనం చేసింది. ఈ భారతీయ రూపకం దశవిధమైన ప్రధాన భేదాలతోనుఅనేక ఉపరూపకాలతోను విస్తరిల్లి సామాజికుని మనోరంజనమే లక్ష్యంగా సాగి
दुःखार्तानां श्रमार्तानां शोकार्तानां तपस्विनां
विश्रांतिजनन काले नाट्यमेतद्भविष्
ఇలాంటి అనేక రూపక రూపాలలో ఈహామృగం ఒకటి.

రూపక శబ్ద నిరుక్తి

రూపక శబ్దం రూప్ ధాతువునుంచి ఉద్భవించింది. సాహిత్యంలో రూపకశబ్దం నాట్యానికి వాచకంగా ఎంచబడుతున్నది. కంటికి కనిపించే వస్తువులకు రూపాన్ని ఎలా అంగీకరిస్తున్నామో అదే విధంగా నాట్య లేదా అభినయానుకూలమైన కావ్యరూపాన్ని రూపకమంటూ రూపకం గూర్చి విశ్వనాథుడు తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ तादृश्यं काव्यं नटे रामादिस्वरूपारोपाद्रूपकमित्युच्यते3 అన్నాడు. అంటే నటునిలో రాముడు మొదలైన పాత్రల స్వరూపాలు ఆరోపితమౌతాయి. ఆయా వేషధారణల వల్ల సామాజికులలో ఇతడు రాముడు అనే భావన కలుగుతుంది. ఇట్టి ఆరోపము కలుగుతున్నది కనుక దృశ్యకావ్యం రూపకం అని పిలువబడుతున్నది. భావప్రకాశకారుడైన శారదాతనయుడు కూడా तेषां रूपक संज्ञा अपि प्रायो दृश्यतया क्वचित्4 అంటూ ఇట్టి అభిప్రాయాన్నే వ్యక్తపరిచాడు. ధనంజయుడు తన దశరూపకంలో ततस्मारोपात्5 అంటూ ఈ అభిప్రాయాన్నే బలపరిచాడు.

ఈహామృగ లక్షణం

ईह चेष्टा मृगस्यैव स्त्रीमात्रार्थम् यत्र स ईहामृगः6 అని నాట్యశాస్త్ర అభినవ బారతీ వ్యాఖ్య నిర్వచిస్తుండగా मृगवदलभ्यां नायिकां नायकः अस्मिन् ईहते इति ईहामृगः7 అని ధనికుడు నిర్వచించాడు.

ధనంజయుడు దశరూపకాన్ని అనుసరించి ఈహామృగ లక్షణాలు ఇవి -

मिश्रमीहामृगे वृत्तं चतुरंक त्रिसंध
नरदिव्यावनियमात्रानायकप्रतिन
ख्यातौ धीरोद्धतावद्भ्यो विपर्यसादयुक्त
दिव्यस्त्रीयमनिच्छन्तीमपहारादिनेच
शृंगाराभासमप्यस्य किंचित् किंचित् प्रदर्श
संरंभं परमानीय युद्धं व्याजन्निवार
वधप्राप्तकृर्वीत वधं नैव महात8

ప్రస్తుతం అతి తక్కువగా లభిస్తున్న ఈహామృగాలలో వేంకామాత్యుని ఊర్వశీ సార్వభౌమ ఈహామృగం ఒ

వేంకామాత్యుని పరిచయం

వేంకామాత్యుని గురించిన సమాచారం మహారాజ వంశావళిహైదర్్నామా అన్న కన్నడ గ్రంథాల గురించిహిస్టరీ ఆఫ్ మైసూర్ అనే గ్రంథాల నుంచి మరియు ఆయన రచించిన కృతులలో లభిస్తున్నది. వేంకామాత్యుని తండ్రి హంపయ్యామాత్యుడుతల్లి వామాంబిక అని తెలుస్తున్నది.

మైసూరు నగరానికి నైఋతి దిశలో ఉన్న చట్టనపల్లి గ్రామానికి సమీపాన కపిలానదీ తీరంలో ఉన్న రామపురం అనే గ్రామంలో  ప్రాంతంలో వేంకామాత్యుడు జన్మించాడు. ఈయన పూర్వీకులు విద్వాంసులే అయినా రాజోద్యోగాలలో స్థిరపడ్డవారు కావడం వల్ల వీరి పేర్లలో ఆమాత్య శబ్దం చోటు చేసుకున్నది. ఆరువేల నియోగి బ్రాహ్మణుడైన వేంకామాత్యుడు రాజనీతికుశల

వేంకామాత్యుడు మైసూరును పాలించిన ఇమ్మడి కృష్ణరాజు వాడియర్్ల వద్ద  నుంచి  వరకు మంత్రిగా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. తరువాత హైదర్ అలీ టిప్పుసుల్తాన్ల వద్ద ప్రధానిగా కొంతకాలం పని చేశాడు. జీవిత చరమాంకంలో అనేక కష్టాలకు గురైన వేంకామాత్యుడు లో మధుమేహ వ్యాధి కారణంగా మరణించ

వేంకామాత్యుని కృతులు
రాజోద్యోగంలో ఉన్నత పదవిలో ఉన్నా వేంకామాత్యుడు తనలోని కవిని మరువలేదు. సంస్కృత సాహిత్యంలో వేంకామాత్యుడు నాటకంప్రకరణం అనే రెండు పక్రియలు తప్ప మిగిలిన ఎనిమిది రూపక పక్రియలో రచన చేశాడు. ఇంతేకాక అనేక ఇతర రచనలను సైతం వేంకామాత్యుడు చేసినట్లు వివిధ రూపకాలకావ్యాల ప్రస్తావనకవి పరిచయాదుల వల్ల తెలుస్తున్నది. ఆయన రచించిన కృతుల పేర్లు ఇవి

కమలవిలాస భాణం కుక్షింభరభైక్షవ ప్రహసనం
మహేంద్రవిజయ డిమం వీరరాఘవ వ్యాయోగం
లక్ష్మీస్వయంవర సమవకారం విబుధదానవ సమవకారం
సీతాకల్యాణ వీథి రుక్మిణీమాధవాంకం
ఊర్వశీ సార్వభౌమేహామృగం

కావ్యాలు

జగన్నాథవిజయ మహాకావ్యం సుధాఝరి (గద్యకావ్యం)
కుశలవ చంపూ ఇందిరాభ్యుదయ కావ్యం

ఇతరాలు

చిదద్వైతికా (అద్వైవతపరమైన ధార్మిక గ్రంథం) ఆంజనేయ శతకం
సూర్యశతకం అలంకార మణిదర్పణం (అలంకార గ్రంథం)

ఇతివృత్తం

నారదముని నారాయణముని శిష్యుడనినారాయణ ముని తపస్సు చేస్తుండగాదానిని భగ్నం చెయ్యడానికి ఇంద్రుడు రంభాది అప్సరసలను పంపాడనినారాయణ ముని తన ఊరువుల నుండి రంభాదులను సౌందర్యంలో ధిక్కరించే స్త్రీని సృష్టించాడనిఆమెను గురించి నారదుడు పురూరవునితో చెప్పడం జరుగుతుంది. అప్పటినుండి పురూరవుడు ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు.

ఇంద్రవశవర్తియైన ఊర్వశీని పొందడం ఎలా అని చింతిస్తున్న పురూరవుని తాపాన్ని గ్రహించలేని విదూషకుడు దాన్ని పరిహాసంగా తీసుకుని పురూరవుని చేత మన్మధునికిమందనిలయానికి ప్రార్థనలు చేయిస్తాడు. ఊర్వశీ అమరావతిలో ఉన్నదనే వాస్తవాన్ని పురూరవునికి విదూషకుడు తెలుపును. ఇంతలో ఇంద్రుని సారథియైన మాతలి పురూరవుని తీసుకుపోవడానికే రథంతో సహా వచ్చినట్లు ప్రతీహారి వచ్చి చెబుతాడు.

ఇద్దరు గంధర్వుల సంభాషణ ద్వారా పురూరవుడు దేవేంద్రునికి సహాయం చేశాడని తెలుస్తుంది. అది విన్న ఊర్వశీ పురూరవుని ప్రేమించడం జరుగుతుంది. ఈ విషయం చెలికత్తెకు తెలుస్తుంది. ఉద్యానవనంలో స్త్రీలు మాట్లాడుకుంటుంటారు. వారి మాటలను విందామని చిత్రరథుడుదేవేంద్రుడు చాటుగా దాక్కుంటారు. ఆ స్త్రీల మాటల ద్వారా వారు ఊర్వశీ మరియు సఖి అని తెలుసుకుంటారు. ఊర్వశి పురూరవుని ప్రేమిస్తున్నదని ఇంద్రుడు గ్రహిస్తాడు.

ఒకనాడు ఊర్వశీసఖి మందారవనంలో విహరిస్తుండగా ఆ ప్రదేశానికి పురూరవుని వేషంలో దేవేంద్రుడుచిత్రరథుడు వస్తారు. ఊర్వశి అతనిని పురూరవునిగానే భావించి అతిథి సత్కారాలు చేస్తుంది. ఇంతలో పుష్పక విమానంపై మాతలివాస్తవ పురూరవుడు విశ్రాంతి కోసం ఆ ప్రదేశానికే వస్తారు. ఊర్వశీసఖి ఇద్దరు పురూరవుల్ని చూసి ఆశ్చర్యపోతారు. మాయా పురూరవులు ఇద్దరూ యుద్ధానికి సిద్ధపడతారు. ఇంతలో నారదముని అక్కడికి వచ్చి మొదట వచ్చింది మాయా పురూరవుడనితర్వాత వచ్చిన వ్యక్తి అసలు పురూరవుడని ఊర్వశికి చెప్పిఊర్వశి ఎవరిని కోరుకుంటే వారే ఆమె భర్త అవుతారని నారాయణముని ఆదేశమని చెబుతాడు. ఊర్వశి అందుకు ఆనందించి వాస్తవ పురూరవుని భర్తగా గ్రహిస్తుంది

ఈహామృగ లక్షణ సమన్వయం

 నాంది

अर्थतः शब्दतोवापि मनाक् काव्यार्थसूचनम्
यत्राष्टभीर्द्वादशभिरष्टादशभिरे
द्वाविंशत्या पदैर्वापि सा नान्दी परिकीर्त9 అని ప్రతాపరుద్రీయంలోని నాటక ప్రకరణం చెబుతున్నది. అంటే అర్థశబ్దాలతో కావ్యార్థ సూచన చేస్తు పన్నెండు లేదా పద్దెనిమిది లేదా ఇరవైరెండు పదాలతో ఉండే పద్యం నాందీ అని తెలిస్తున్నది.

వేంకామాత్యుడు తన ఊర్వశీసార్వభౌమేహామృగంలో
जयति पतिरखिलजगतां जलद्युतिरेष दशमुखारातिः
वशमेत्य यस्य कीर्किर्वासकसज्जेव जगदलञ्च10 అని నాందీ పద్యాన్ని చెప్పాడు. ఇందులో పన్నెండు పదాలున్నాయి. ఈ నాందీశ్లోకంలో రాములవారి స్తుతితోపాటు వాసకసజ్జికయైన నాయిక సూచించబడింది. అలాగే మరో నాందీ పద్యాన్ని హనుమంతుని పరంగా రచించాడు.

 ప్రస్తావన

सूत्रधारो नटीं ब्रूते मार्षवाथ विदूषकम्
स्वकार्य प्रस्तुताक्षैपि चित्रोक्त्या यत्तदाम
प्रस्तावना वातत्र स्युः कथोद्घातः प्रवक
प्रयोगातिशयश्चाथ वीथ्यङ्गानि त्रय11 అంటూ దశరూపకం ప్రస్తావనా లక్షణాన్ని చెప్పింది. అంటే పూర్వరంగంలో ఒక సూత్రధారుడు నాందీశ్లోకాన్ని చదివిన తర్వాత రెండవ సూత్రధారుడు వచ్చి ఆకాశభాషితాలు లేదా సామాజిక వచన సంబంధియైనల మాటలతో రూపక పరిచయాన్ని చేస్తాడు. దీనికే ప్రస్తావనా లేక స్థాపనా లేక ఆముఖం అని పేరు. ఇందులో రెండవ సూత్రధారుడు నటి లేదా పారిపార్శ్వికుడైన మారిషునితో లేదా విదూషకునితో కలసి వచ్చి రూపక కర్త పరిచయాన్నిరూపక పరిచయాన్ని చేస్తాడు.

వేంకామాత్యుడు తన ఊర్వశీసార్వభౌమేహామృగంలో సూత్రధారుడునటి అనే పాత్రల మాధ్యమంగా రూపకకారుని పరిచయాన్ని చేసికంచుకీతో కలసి శేఖరుకుడు వస్తున్నాడు అనే పాతప్రవేశ పరిచయాన్ని చేసి నాటక నిర్వహణకు తెరతీశాడు.

 ఇతివృత్తం

ఈహామృగంలోని ఇతివృత్తం మిశ్రం. అంటే ప్రఖ్యాతమైన కథలు స్వంతమైన కల్పనలు చేసి తయారు చేసిన ఇతివృత్తం ఉంటుంది. రూపకకారునికి పురాణాది ప్రసిద్ధమైన వృత్తాంతాన్ని తీసుకుని స్వంత కల్పనలు చేసే అవకాశముంటుంది. వేంకామాత్యుడు తన ఈహామృగంలో ఇంద్రుడు పురూరవుని ప్రేయసియైన ఊర్వశీని మోహించిఆమెను పొందడానికి అహల్యను మోసగించినట్లు మారువేషంలో వచ్చి మోసగించ ప్రయత్నించినట్లు కల్పన చేసి మిశ్రేతివృత్తాన్ని కల్పించాడు.

అంక సంఖ్య

ఈహామృగంలోని అంకాల సంఖ్య నాలుగు. అయితే నాట్యదర్పణం అంకాల సంఖ్య ఒకటి అని చెప్పింది. మిగిలిన గ్రంథాలన్నీ అంక సంఖ్యను నాలుగు అనే చెప్పాయి. కనుక ఈహామృగంలోని అంకాల సంఖ్య నాలుగు అని చెప్పవచ్చు. ఈ లక్షణానుసారియై వేంకామాత్యుడు తన ఊహామృగంలో నాలుగు అంకాలను రచించాడు.

 సంధులు

రూపకాలలో చెప్పబడిన పంచసంధులలోని మూడు సంధులు ఈహామృగంలో ఉంటాయి. దశరూపకం కే त्रिसन्धिकम् అని మాత్రమే చెప్పగాసాహిత్యదర్పణం మాత్రం मुखप्रतिमुख सन्धि तत्र निर्वहणं तथा అంటూ ముఖప్రతిముఖనిర్వహణ సంధులు ఉంటాయని స్పష్టీకరించింది. అంటే గర్భ సంధిఅవమర్శ సంధులుండవు. ఈ లక్షణానుసారియై వేంకామాత్యుడు తన ఊహామృగంలో ముఖప్రతిముఖనిర్వహణ సంధులకే స్థానం కల్పించాడు.

 నాయక-ప్రతినాయకులు

ఈహామృగంలో నాయకప్రతినాయకులు నరులుదివ్యులు కావచ్చు. అంటే నాయకుడు దివ్యుడుప్రతినాయకుడు నరుడు లేదా నాయకుడు నరుడుప్రతినాయకుడు దివ్యుడు లేదా నాయక ప్రతినాయకులిరువురూ నరులు లేదా దివ్యులు కావచ్చు. అనియమౌ అని చెప్పబడిన కారణంగా ఈ నాయక ప్రతినాయకులు దివ్యులు కావాలామర్త్యులు కావాలా అన్నది నాటకకర్తకు స్వయంగా నిర్ణయించుకునే అవకాశం లభించింది. అయితే నాయక ప్రతినాయకులిద్దరూ ఖ్యాతులు కావాలనినాయకుడు ధీరోదాత్తుడుప్రతినాయకుడు ధీరోద్ధతుడు కావాలని తెలుస్తున్నది.

ఈ లక్షణానుసారియై వేంకామాత్యుడు తన ఊహామృగంలో మర్త్యుడైన పురూరవుని నాయకునిగాను దివ్యుడైన ఇంద్రుని ప్రతినాయకునిగా నిలిపాడు. తనయందు ఆనురాగంలేని అప్సర ఊర్వశీని పొందాలని ప్రతినాయకుడైన ఇంద్రుడు ఛలరూపంలో వచ్చినట్లు కల్పించాడు. మర్త్యుడైనా పురూరవుని దేవతలకు సాయం చేసే ఉదాత్తునిగానుతన శక్తిచేత గర్వించిన ఇంద్రుని ఉద్ధతునిగాను వర్ణించాడు. వీరిరువురూ ధీరులే కనుక ధీరోదాత్త నాయకధీరోద్ధత ప్రతినాయకులుగా పురూరవఇంద్రులు ఈ ఈహామృగంలో కనిపిస్తారు. ప్రతినాయకుడు తనయందు ఆసక్తి లేని దివ్యస్త్రీని బలవంతంగామోసంచేత పొందాలని ప్రయత్నిస్తాడు.

 రసం

తనయందు రమణేచ్ఛ లేని స్త్రీని ప్రతినాయకుడు పొందాలనుకుంటాడు కనుక అతనియందు శృంగారాభాసం రసమౌతుంది అన్నది ఈహామృగ లక్షణం. ఈ ఊర్వశీ సార్వభౌమేహామృగ ఈహామృగంలో తనయందు ఆసక్త కాని ఊర్వశీని ఇంద్రుడు మాయారూపంతోనైనా పొందాలనుకుంటాడు. ఆమె అతనియందు అనాసక్త కావడంతో రసం శృంగారాభాసంగా మారింది. ఇక ఇంద్రపురూరవులు ఊర్వశీ ప్రేమ విషయికమై యుద్ధానికి సిద్ధపడడంతో వీరరసం ఆవిష్కృతమైనాయి. ఆ సందర్భంలో వేంకామాత్యుని పద్యం ఈ క్రిందివిధంగా ఉన్నది.

क्वचिद्भ्रमित पट्टसं क्वचिदुदीतसिंहस
क्वचिद्धृदयभेदन प्रधानवीरवादोल्
क्वचिच्छरधनुष्करप्रसभपातिसादि व
प्रचारनयनोत्सवं जयति जन्यभूमी12

రణస్థలిని గురించిన వర్ణనం ఇందులో ఉన్నది. పట్టసాలు అనే ఆయుధాలను ఊపుతున్నారు. కొందరు సింహనాదాలు చేస్తున్నారు. కొందరు చేస్తున్న సింహనాదాల వల్ల ప్రత్యర్థుల గుండెలు వ్రక్కలౌతున్నాయి. పరవీరుల హృదయభేదనం చేస్తామని కొందరు వీరాలాపాలు పలుకుతున్నారు. అశ్వారోహులై శరపరంపరలు కురిపిస్తున్న యోధులు పరవర్గాలను చీల్చిచెండాడుతున్నారు. ఇలాంటి వాతావారణంలో ఆ రణస్థలి నయనమనోహరంగా భాసిస్తున్నదని ఈ పద్యం వర్ణిస్తోంది. ఇది వీరుల యుద్ధవీరానికి ప్రతీక వంటిది.

8 వధాది విషయం

నాయక ప్రతినాయకుల మధ్య యుద్ధం వరకు సంరంభం పెరిగినట్లు చూపాలి. అయితే ఆ యుద్ధం నివారింపబడాలి. పురాణ కథల ప్రకారం ప్రతినాయకుని మధ జరిగనట్లున్నా, ఆ వధను ప్రదర్శింపకూడదు. ఏదో ఒక వ్యాజ్యంపై యుద్ధం నివారింపబడినట్లు నాటకకారుడు కల్పించాలి. అన్నది ఈహామృగ లక్షణం. తదనుసారియై వేంకామాత్యుడు తన ఈహామృగంలో ఊర్వశీ విషయికమై ఇంద్ర, పురూరవులు యుద్ధసన్నద్ధులు కావడాన్ని చిత్రించి, నారదముని నారాయణముని ఆదేశాన్ని తీసుకువచ్చి, వారిరువురి మధ్య జరుగనున్న యుద్ధాన్ని నివారించినట్లు చిత్రీకరించాడు. దీనితో రంగస్థలంపై ప్రదర్శితము కాకూడని యుద్ధం తొలగిపోయింది.

ఈవిధంగా వేంకామాత్యుడు శాస్త్రగ్రంథాలలో చెప్పబడిన అన్ని ఈహామృగలక్షణాలకూ సరైన లక్ష్యంగా తన ఊర్వశీసార్వభౌమేహామృగాన్ని రచించాడు.

వర్ణితమైన సామాజిక పరిస్థితులు

ఏ కవి ఏ కావ్యాన్ని రచించినా తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, తన కాలం నాటి సమాజాన్ని అందులో ప్రతిబింబిస్తాడు. ఇది సర్వసాధారణమైన విషయం. అలాగే వేంకామాత్యుని కాలం నాటి పరిస్థితులు కూడా ఈ ఈహామృగంలో కనిపిస్తున్నాయి. అయితే ఈహామృగమనే పక్రియ ఒక నిర్ధారితమైన కథా సంవిధాన ధోరణిని కలిగి ఉంటుంది. ఇతివృత్తం అనాసక్త అయిన స్త్రీని పొందాలని ప్రతినాయకుడు కోరుకోవడం అనే అంశం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇలాంటి కావ్యంలో నాటి సమాజం పెద్దగా ప్రతిబింబించదు. ఐనా కవి చుట్టూ ఉన్న సమాజం ఏదోఒక విధంగా తనదైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ ఈహామృగంలోనూ వేంకామాత్యుని కాలం నాటి సమాజం కొద్దిగా ప్రతిబింబిస్తున్నది.

ఊర్వశీ సార్వభౌమేహామృగ నాటకాన్ని కవే స్వయంగా సామాజికులకు సూత్రధారుని వల్ల పరిచయం చేస్తున్నాడు. సామాజికులు ఈ నాటకాన్ని ఏవిధంగా చూస్తారు అని నటి ప్రశ్నించగా సూత్రధారుడు ఈ నాటకంలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి సహృదయులైన సామాజికులు దీనిని చూసి ఆనందిస్తారు అని చెబుతున్నాడు.

ఈ రూపక ప్రథమాంకంలోనే పురూరవుడు ఊర్వశీని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న విదూషకుడు రత్నమాణిక్యాదులను ఇచ్చి ఊర్వశిని తెచ్చుకోమని సలహా ఇస్తాడు. ఈ ఘటన ఆనాటికాలంలో స్త్రీలను వశవర్తినులుగా చేసుకోవడానికి పురుషులు వస్త్రాభరణాలను కానుకలుగా ఇచ్చేవారని తెలుస్తున్నది. వేంకామాత్యుని కాలంలోని కర్ణాటకాలో నాడు ఒక ప్రక్క విలాసవంతమైన వాడియర్ల పాలన, మరోప్రక్క హైదర్ అలీ, టిప్పుల పాలన జరిగింది. వాడియర్ల పాలన, హైదర్ అలీ పాలన రెండూ స్త్రీని భోగ్యవస్తువుగానే చూశాయి. బలంతో లేదా కానుకలతో స్త్రీలను వశపరుచుకోవడం ఆ కాలంలో విరివిగానే సాగిందని చెప్పవచ్చు. నాయకుడైన పురూరవునికి మిత్రుడైన విదూషకుడు రత్నాభూషణాదులతో ఊర్వశీ మనస్సు గెలుచుకోమని సలహానిస్తాడు. ఇది నాటి స్త్రీలపట్ల అప్పటి పురుషులకున్న భావాలను వ్యక్తపరుస్తున్నది.

స్త్రీలు ఆరోజుల్లో ఉన్నత శిక్షణను పొందేవారు. భార్యపై భర్తకు సర్వాధికారముండేది. పూర్ణవయస్కురాళ్లైన స్త్రీలకే వివాహాలు చేయబడేవి. ఊర్వశీ యొక్క సఖి సుశిక్షితురాలు, చిత్రకళా ప్రవీణ అన్న విషయం మనం పరికించవచ్చు. తన తండ్రి నారాయణముని అంటే ఇంద్రునికి భయమని, అలాంటి పని ఇంద్రుడు చెయ్యలేడని ఊర్వశీ చెబుతుంది. ఈ వాక్యాల వల్ల బలవంతుడైన, ప్రభావశీలురైన వ్యక్తుల కుటుంబాలలోని స్త్రీలకు రక్ష అండేదని, వారిది భద్రలోకమని తెలుస్తున్నది. అయితే చెలికత్తె ప్రశ్నించిన తీరును గమనిస్తే ఆనాటి సమాజంలో తాను మోహించిన వనితని అపహరించుకుపోయే సంప్రదాయం ఉండేదని తెలుస్తున్నది. అంటే సామాన్యవర్గాలకు చెందిన మహిళలకు సామాజికంగా పెద్దగా భద్రత ఉన్నట్లు కనిపించదు. బాల్యవివాహాలు ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఉనికిలోకి వచ్చాయని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేంకామాత్యుని కాలం నాటికి మహిళలకు పెద్దగా భద్రత ఉన్న పరిస్థితులు ఉండేవి కావని తెలుస్తున్నది.

తృతీయాంకలోని చిత్రర వాక్యాలను బట్టి స్త్రీలు గృహకార్య సంబంధి కళలు, చిత్రకళ, సంగీతం, కావ్యకళ మొదలైనవాటియందు నిపుణలు. కొద్దిగా వైద్యం కూడా తెలుసుకుని ఉండేవారని తెలుస్తున్నది. ఊర్వశీ విరహతాపాన్ని అనుభవిస్తున్నప్పుడు సఖి తేసిన వైద్యం తెల్లని గంధాన్ని, చందనాన్ని ఊర్వశీకి పూయగానే అవి కర్పూరవర్ణంలోకి మారిపోతాయి.

ఇక చతుర్థాంకంలో దేవేంద్రుడు, పురూరవుల మధ్య యుద్ధం జరుగుతుండగా నారాయణముని శిష్యగణం అక్కడికి వస్తుంది. వారితోపాటే అక్కడికి వచ్చిన నారదముని ఊర్వశి ఎవరిని కోరుకుంటుందో వారే ఆమె భర్త అన్న నారాయణ ముని ఆదేశాన్ని వినిపిస్తాడు. ఊర్వశి అందుకు సంతోషించి పురూరవుని భర్తగా అంగీకరిస్తుంది. ఈ ఘటనతో స్త్రీకి తన ప్రేమ విషయంలో స్వేచ్ఛ ఉండాలని కవి బోధిస్తున్నాడు. అప్పటి సామాజిక పరిస్థితుల ప్రకారం బలవంతుడైనవాడు తనకు నచ్చిన స్త్రీని అపహరించుకుపోయే పరిస్థితులు ఉండగా, అది తప్పని స్త్రీకి సైతం మనస్సుంటుందని, ఆమె తనకు నచ్చినవారిని జతగా ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని కవి వేంకామాత్యుడు ప్రబోధిస్తున్నాడు. ఇది నాటి సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టే పరిస్థితి అని చెప్పవచ్చు.

ఉపసంహారం

నాటకం ప్రపంచ సాహిత్యాకాశంలో ఒక విశిష్టమైన తారక వంటి పక్రియ. విశ్వవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర వేల సంవత్సరాలుగా నాటకం ప్రదర్శనకళగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నది. భారతీయ నాటక కళ ప్రపంచ నాటక కళలన్నింటిలో సుసంపన్నమై, సువృవస్థితమై విశిష్టమైనదిగా పేరుగాంచింది. ఋగ్వేదంలోని మూలబీజాలున్న భారతీయ రూపకం దశరూపకాలుగా విస్తరించింది. అవడానికి దశరూపకాలనే భేదాలున్నా అన్ని రూపక పక్రియలలోనూ తగినంత సాహిత్య సృష్టి జరుగలేదు. దశరూపకాలలో తొలి స్థానాలను ఆక్రమించిన నాటకం, ప్రకరణం దాదాపు సింహభాగాన్ని ఆక్రమించి, ఇతర రూపక పక్రియలకు పెద్ద విస్తృతి లేకుండా చేశాయి. అలా వెనుకబడిన రూపక భేదమే ఈహామృగం.

ఈహామృగం దశరూపకాల్లో ఒకటిగా చెప్పబడినా, దానికి లక్ష్యంగా చూపడానికి తగినన్ని ఈహామృగాలు రచింపబడలేదు. ధనంజయుని దశరూపకంలో ఉదాహరణలుగా చెప్పబడ్డ ఒకటి రెండు ఈహామృగాల పేర్లు తప్ప, ఈ రూపక పక్రియను గురించి అధ్యయనం చెయ్యడానికి తగుమాత్రం సాహిత్యం లభించడం లేదు. ఒకనాడు బాగా విస్తరిల్లిన రూపక చరిత్రలో అనేక ఈహామృగాలు వచ్చి ఉండవచ్చు. అయితే తాళపత్రాల జీవితకాలం తక్కువ కావడం, వాటికి ప్రతులు రాయడం ఓర్పుతో కూడుకున్న పని కావడంతో ఈహామృగాలు అనేకం వచ్చినా అవి నేడు అలభ్యాలుగా మారడానికి ఇదే కారణం కావచ్చు. ఈహామృహ రచనకు పూనుకున్న నాటకకారులు కూడా లేరు. ఈ లోపాన్ని గమనించి ఊర్వశీ సార్వభౌమేహామృగాన్ని వేంకామాత్యుడు రచించాడు.

కర్ణాటకా సామ్రాజ్య చరిత్రలో మంచి కార్యనిర్వహణదక్షునిగా, మంచి ప్రధానిగా పేరున్న వేంకామాత్యుడు దశరూపకాలలోని అన్ని ప్రభేదాలలోను రూపక రచన సాగించాడు. ఆయన కలం నుంచి వెలువడిన ఊర్వశీసార్వభౌమేహామృగం అన్ని ఈహామృగ లక్షణాలకూ సరైన లక్ష్యంగా నిలుస్తున్నది. వేదం సాహిత్యం నుంచి కథా సరిత్సాగరం వరకు ఉన్న సాహిత్యంలో పురూరవుని కథ కనిపిస్తుంది. ఆ పురూరవునికి, ఊర్వశీకి మధ్యన గల ప్రేమను ఇతివృత్తంగా తీసుకుని వేంకామాత్యుడు సర్వలక్షణ లక్ష్యంగా ఈ ఊర్వశీసార్వభౌమేహామృగాన్ని రచించడం జరిగింది. ప్రస్తుతం లభిస్తున్న రెండే రెండు ఈహామృగాలలో వేంకామాత్యుని ఊర్వశీసార్వభౌమేహామృగం ఒకటి. దీనిని అధ్య-యనం చేయడంతో మనం మరుగైపోయిన ఈహామృగం అనే రూపక భేదాన్ని గురించి కొంతైనా అవగాహనను కల్పించుకోవచ్చు అలాగే రూపక సాహిత్యంలోని అన్య పక్రియలపై ఆసక్తిని పెంచుకోవడానికి ఉపయోగిస్తుంది.

పాదసూచికలు
1. नाट्यशास्त्रं 1-114
2. భారతీయ నాట్యకళా - సురేంద్రనాథ దీక్షిత్ పు.19
3. సాహిత్య దర్పణం - శ్రీకాంత శాస్త్రి పుట 238
4. భావప్రకాశం - మదనమోహన్ అగ్రవాల్ పు. 21
5. దశరూపకం - సుధాకర మాలవీయ పుట 6
6. నాట్యశాస్త్రం - అభినవ భారతీ వ్యాఖ్య పు. 326
7. దశరూపకం - ధనిక వ్యాఖ్య
8.దశరూపకం 3-72 నుంచి 75 వరకు
9. प्रतापरुद्रयशोभूषणं-नाटक प्रकरणं 34
10. ऊर्वशीसार्वभौमेहामृगं 1-1
11. दशरूपकं 3-7 నుంచి 9
12. ऊर्वशीसार्वभौमेहामृगं 4- 16

ఉపయుక్త గ్రంథ సూచిక
SANSKRIT
1. अलंकारसंग्रहं-अमृतानन्द योगि, (सं) वि.कृष्णमाचार्य, द अडयार लैब्ररी, मद्रास
2. ऊर्वसीसार्वभौमेहामृगं- वेन्कामात्या, ओरियन्टल रीसर्च इन्स्टिट्यूट, मैसूर वि.वि.,मैसूर
3. ऋग्वेद संहिता - वेदिक संशोधन मंडल, पुणे
4. छंदोमञ्जरी सुधा
5. दशरूपकम्-(सं) सुधाकर मालवीय, चौखम्बा अमरभारती प्रकाशन, वारणासी
6. दशरूपकम्-(सं) विश्वनाथ भट्टाचार्या, भारतीय संस्कृति संस्थान, नारीबाग, हैदराबाद
7. नाट्यशास्त्रम्-धनिक व्याख्या (सं) डा. वैजनाथ पाण्डेय, मोतीलाल बनारसीदास, दिल्ली
8. नाट्यशास्त्रं-अभिनवभारती व्याख्या, (सं) मधुसूदन शास्त्री, संस्कृत साहित्य अनुसन्धान समिति, काशी विश्वविद्यालय, काशी
9. भावप्रकाशनम्-(सं) मदनमोहन अग्रवाल, राधाकृष्ण जनरल स्टोर, चौक बाजार, मथुरा
10. साहित्यदर्पणं- विश्वनाथ(सं) श्रीकान्त शास्त्री, कृष्णदास अकादमी, वाराणसी

HINDI
1. भारतीय नाट्य साहित्य - डाँ. नगेन्द्र, सेठ गोविन्ददास हीरक जयन्ति समिति, नई दिल्ली
2. हिन्दी अभिनव भारती - डॉ. नगेन्द्र, हिन्दी विभाग, दिल्ली विश्वविद्यालय, दिल्ली
3. हिन्दी नाट्यदर्पण - (सं) डॉ. नगेन्द्र, हिन्दी विभाग, दिल्ली विश्वविद्यालय, दिल्ली

ENGLISH
1. Major Sanskrit works on Stage-craft - A comparative study- Venkatesh M Giri, PhD thesis, University of Mysore
2. Sanskrit Drama - A.B.Kith, Motilal Banarasidas, Jawahar Nagar, Delhi

No comments:

Post a Comment