Pages

Wednesday, November 23, 2011

నేటి భావితరం - నాదే ఓ పాత కవిత

నేటి భావితరం
ఇది దాదాపు ఏదేళ్లక్రితం మాతృభాషకు దూరమౌతున్న బాలతరం గురించ ఈటీవి-2కి ఓ కార్యక్రమానికి స్క్రిప్టు రాస్తూ తయారుచేసుకున్న ఓ చిరు కవిత.              ........పూర్ణప్రజ్ఞాభారతి

వారు
చిన్నారులు
సృజనశీలురు
ప్రతిభావంతులు
అయితే మాత్రమేం
మూడు భాషల నిబంధనక్రింద
గొంతు కోల్పోయిన
నిర్భాగ్యులు
శబ్దదరిద్రులు



మాతృభాష మృతభాషగా మారుతుంటే
గుండెఘోషను వెళ్లగక్కలేక
మౌనముద్రను వహించిన
బాలయోగులు
యోగబాలలు

మొద్దులన్న ముద్రతో
నిరర్థక విద్యతో
నిర్వీర్యమౌతున్న మొలకలు
ఎలుకల పరుగుల విద్యలో
పరుగిడలేని
నవతరం దూతలు
మృతజీవులు
జీవన్మాత్రశేషులు

No comments:

Post a Comment